కరప్షన్ ఖాకీ సిఐ సుబ్బారావుపై వేటు

248

THE BULLET NEWS (BUCHIREDDYPALEM)-నెల్లూరుజిల్లాలో మరో కరప్షన్ ఖాకీ పై వేటు పడింది.. ఆకాశమే హద్దుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నబుచ్చి సిఐ సుబ్బారావును ఇంటింటికి సాగనంపారు.. దీంతో ఎస్పీ పిహెచ్ డీ రామకిష్ణ మరోసారి అవినీతి అధికారులపై కొరడా ఝులిపించారు.. ఫిర్యాదిదారుల వద్ద, వ్యాపారస్తుల వద్ద మామూళ్లు తీసుకుంటూ,
బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు జిల్లా ఎస్పీ కి పిర్యాదు చేశారు. .దీంతో విచారణ చేపట్టిన ఎస్పీకి అయ్యగారి అవినీతి బాగోతం గుట్టలుగుట్టలుగా బయటికి వచ్చాయి.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారులను సైతం బెదిరించి తప్పుడు కేసులు బనాయిస్తూ అందినకాడికి అడ్డగోలుగా సంపాదించిన సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.. కేసులకు సంబంధించి ఎఫ్.ఐ. అర్. నమోదులో ముద్దాయిలకు అనుకూలంగా సెక్షన్లను మార్చి, వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఎస్పీ చేసిన విచారణలో వెల్లడైంది.. దీంతో పాటు మిల్లర్లను బెదిరించి భారీగా నగదు వసూలు చేసినట్లు నిర్దారణ
కావడంతో సుబ్బారావుపై వేటేశారు..

SHARE