ఒకరు ముద్దులు పెడతారు.. ఇంకొకరు..

109

The bullet news (POLITICAL)-

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు విని జనం నవ్వుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇవాళ ఆయన అమరావాతిలో మాట్లాడుతూ తన అన్న చిరంజీవి, బావ అల్లు అరవింద్‌నే పవన్‌ గెలిపించ లేకపోయారని గుర్తు చేశారు. జగన్ ఓటుకు ఐదు వేల ఇవ్వడానికి రెడీగా ఉన్నారని.. బీజేపీ సాయంతో పవన్‌ కూడా ఓటుకు ఐదు వేలు ఇస్తారని వెంకన్న ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌తోపాటు వైసీపీ అధినేత జగన్‌.. పొలిటికల్‌ డిప్రెషన్లో ఉన్నారని అన్నారు. ‘ఒకాయన ముద్దులు పెడతారు.. మరోకాయన స్టేజ్ మీద ఆవేశంతో ఊగిపోతారు’ అని వెంకన్న ఎద్దేవా చేశారు.

SHARE