బుల్లెట్ ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన పడుగుపాడు పంచాయతీ కార్యదర్శి

113

THE BULLET NEWS (KOVUR)-నెలరోజుల నుంచి అక్కడ పారిశుద్ద్యం అటకెక్కింది.. పంచాయతీ కార్మికులున్నా.. వారితో పనిచేయించే అధికారి కరువువయ్యారు.. నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. పిర్యాదు చేసేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు.. పారిశుద్ద్య పనులు సక్రమంగా
చూడాల్సిన అధికారులు పట్టించుకోలేదు.. దీనిపై బుల్లెట్ న్యూస్ ప్రసారం చేసిన కథనం అధికారులను కదిలించింది. స్పందించిన ఎంపీడీవో జాలిరెడ్డి పారిశుద్ద్య పనులను సక్రమంగా చేయాలంటూ అధికారులను ఆదేశించారు..దీంతో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రంగంలోకి దిగారు.. మునిసిపల్ కార్మికులను వెంటపెట్టుకుని పారిశుద్ద్యపనులను దగ్గర నుండి పర్యవేక్షించారు.. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని, ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. పారిశుద్ద్యపనుల్లో
జాప్యం ఏమి జరగడంలేదని ఆయన చెప్పుకొచ్చారు..

ఈవోఆర్డి శ్రీనివాసుల పనితీరు ఘోరం..
పంచాయతీల్లో కీలకంగా వ్యవహరించే ఈవోఆర్డీ శ్రీనివాసులు పనితీరు ఘోరంగా ఉందని పడుగుపాడు వాసులు మండిపడుతున్నారు.. ఇప్పటికైనా పనితీరు మార్చుకుని జనం మెచ్చేఅధికారిగా గుర్తింపు తెచ్చుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు..

 

SHARE