బ్యూటీషన్ జ్యోతి అనుమానాస్పద మృతి.

92

THE BULLET NEWS (HYDERABAD)-హైదరాబాద్‌లోని లింగంపల్లిలో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందని జ్యోతి అనే యువతి.. లింగంపల్లిలోని గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తాండూరులోని అమ్మమ్మ వాళ్ళింటికి అని బయల్దేరిన జ్యోతి ధారూర్‌ మండలం మైలారం రైల్వే స్టేషన్‌లో శవమై తేలింది. సదరు యువతిని సోమవారం ఉదయం రైల్వే సిబ్బంది గుర్తించగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది.

సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యానా?… ఆత్మహత్యానా?.. రైలు నుంచి పడిపోయిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే జ్యోతి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెపై అత్యాచారం జరిపి.. అనంతరం హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. జ్యోతి ఫోన్ మైలారం సమీపంలో దొరికినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు లింగంపల్లి స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. యువతితో పాటు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు.

SHARE