న‌లుగురు చైన్ స్నాచ‌ర్స్ అరెస్టు – 16ల‌క్ష‌ల విలువ చేసే బంగారం స్వాధీనం

103

The bullet news (Nellore)_ నిర్మానుష్య ప్రాంతాలను, ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ కు తెగబడుతున్న నలుగురిని నెల్లూరు సీసీఎస్, నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి సుమారు 16 లక్షల విలువ చేసే 70 సవర్ల బంగారం, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు..

చెడు వ్యసనాలకు బానిసైన ఒంగోలుకు చెందిన శివశంకర్ రెడ్డికి నెల్లూరుకు చెందిన ఆంజనేయులు, నసీర్, రాజేష్ కుమార్ తోడయ్యారు.. ఈజీగా డబ్బులు సంపాదించి జల్సాలు చేసుకోవాలనుకుని చైన్ స్నాచింగ్ కు అలవాటు పడ్డారు.. అలా మొదట కావలిలో ఓ బైక్ కు దొంగలించారు.. దాంతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని స్నాచింగ్ కు తెగబడ్డారు.. వీరి మీద నాల్గో పట్టణం, కావలి, బుచ్చి, ఐదో పట్టణ స్టేషన్లలో దాదాపు 16 కేసులు నమోదయ్యాయి.. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్, నెల్లూరు పోలీసులు వారిని ఇవాళ ఉదయం పట్టుకుని విచారించగా అసలు గుట్టు బయటపడిందని నెల్లూరు ఓఎస్డీ విఠలేశ్వర్ రావు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డిఎస్పీ బాలసుందర్, టౌన్ డిఎస్పీ మురళీకిష్ణ, నాల్గో పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి తదితరులున్నారు..

SHARE