నెల్లూరు సీసీఎస్ పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ.. 14 బైక్స్ స్వాధీనం

104

The Bullet News (  Nellore)_ పార్కింగ్ ప్లేస్ లో బైక్ కనిపిస్తే చాలు.. మరుక్షణం ఆ బైక్ అక్కడుండదు.. నకిలీ తాళాలతో బైక్ ను ఎత్తేస్తాడు.. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఎక్కడ బైక్ కనిపించినా.. దాన్ని చోరీ చేసేదాకా నిద్రపట్టదు.. ఇలా కడప, నెల్లూరు, విజయవాడ, కాళహాస్తి వంటి నగరాల్లో బైక్ లను దొంగలించి చివరికి నెల్లూరు సీసీఎస్ పోలీసులకు దొరికాడు ఘరానా దొంగ సురేష్.. అతని వద్ద నుంచి సుమారు 6లక్షలు విలువ చేసే 14 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు..

బుచ్చికి చెందిన సురేష్ చిన్నచిన్నదొంగతనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు.. ఒకటి రెండు కేసుల్లో జైలు జీవితం అనుభించిన అతను బైక్ లను ఎత్తేయ్యాలని డిసైడ్ అయ్యాడు.. స్వంత జి్ల్లాలో చోరీలకు పాల్పడితే అనుమానం వస్తుందని గ్రహించిన సురేష్ నెల్లూరు, కడప, తిరుపతి, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లి బైక్ లను దొంగతనం చేసేవాడు.. ఇలా దాదాపు 14 బైక్స్ లను అపహరించాడు.. బైక్ ల చోరీలపై నిఘా ఉ్ంచిన నెల్లూరు సీసీఎస్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈఁ విషయం వెలుగులోకి వచ్చింది…

SHARE