తెలుగు రాష్ట్రాల కు కేంద్ర బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు

90

THE BULLET NEWS(NEW DELHI)-కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2018-19 సార్వత్రిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పారదర్శక పాలనను అందిస్తామన్న హామీని నిలబెట్టుకున్నామన్నారు. అవినీతి రహిత సర్కార్ ఏర్పాటుకు కృషి చేశామని తెలిపారు. భారత్‌తో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయన్న జైట్లీ.. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని చెప్పారు. త్వరలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 6.3 శాతంగా ఉందని, వచ్చే ఏడాది 7.4 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని వెల్లడించారు. ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి సాధ్యమన్నారు. సాధించిన ప్రగతిని పటిష్టం చేసుకోవడమే ప్రస్తుత బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశమని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు

ఏపీకి కేటాయింపులు:

 

*ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు

*ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు

*సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు

*నిట్‌కు రూ.54 కోట్లు

*ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు

*ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు

*ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు

*ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు

*డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు

*విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు

*విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1400 కోట్లు

 

తెలంగాణకు కేటాయింపులు:

*తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు

*హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు

*సింగరేణికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు

SHARE