షుగర్ ఫ్యాక్టరీలకు రూ.8000 కోట్ల నజరానా…

60

THE BULLET NEWS (DELHI)-బహిరంగ మార్కెట్‌లో చక్కెర ధర తగ్గిందని, అందువల్ల చెరకు రైతులకు మిల్లులు మద్దతు ధర ఇవ్వలేదని కేంద్రం తేల్చింది. దీనికిగాను చక్కెర మిల్లులకు రూ. 8000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని చెరకు రైతుల బకాయిలు చెల్లించేందుకు ఉపయోగించాలని ఆదేశించింది. అంటే మిల్లుల భారీ ప్రభుత్వం అంటే జనం మోస్తున్నారన్నమాట. దేశంలో చక్కర నిల్వలు అధికంగా ఉన్నాయని, మరోసారి పంట దిగుబడి అధికంగా వస్తోందని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి రవికాంత్‌ మీడియాతో అన్నారు. గత అయిదారు నెలలుగా మార్కెట్‌లో చక్కెర ధర రూ. 9 నుంచి రూ. 10 తగ్గిందని.. దీంతో చక్కెర మిల్లులు రైతులకు బకాయిలు  చెల్లించలేకపోయారని ఆయన చెప్పారు. కిలో చక్కెర తయారీకి కంపెనీకి రూ. 29 అవుతుందని కేంద్రం తేల్చింది.  ఈలెక్కన చక్కెర మిల్లులకు వస్తున్న నష్టాన్ని కేంద్రం భరించేందుకు సిద్ధమైంది.  ఈ ప్యాకేజీలో భాగంగా రూ. 8000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
కొసమెరుపుః బహిరంగ మార్కెట్‌లో కిలో చక్కెర  రూ. 39 నుంచి రూ. 40 పలుకుతోంది. కిలో చక్కెర ఉత్పత్తి వ్యయం రూ. 29గా తేల్చిన కేంద్రానికి ఇంకా మిల్లులను ఎందుకు ఆదుకోవాలనిపించింది? అందులోనూ రూ. 8000 కోట్లు భరించాలా? రేపు ధరలు పెరిఇతే ఈ మొత్తాన్ని కంపెనీల నుంచి ప్రభుత్వం రాబడుతుందా?

SHARE