The bullet news ( నెల్లూరు) :-  రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ ని న్యూఢిల్లీ లో కలిశారు. నెల్లూరు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు నగర పాలకసంస్థ పరిధిలోని వెంకటేశ్వరపురం, రంగనాయకులపేట తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు1500 కుటుంబాలను అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తే బెదిరింపులకు దిగుతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తరవాతే వారిని ఖాళీ చేయించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. అలాగే నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.. నగరంలోని కొండాయపాలెం సెంటర్లో 46.27 కోట్లతో
రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు ఆమోదము వచ్చినప్పటికి రైల్వే అధికారులు పనులకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు.. అంతేకాక కావలి మరింత వేగముగా అబివృది చెందుతున్న పట్టణమని సుమారు లక్ష జనాభా దాటిందని ఇక్కడ శబరి ఎక్స్ప్రెస్ అపవలసిన అవసరముందని తక్షణమే ఆగేవిధముగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు..

SHARE