చంద్రబాబు..బీసీల పొట్ట కొట్టొద్దు..

68

The bullet news (Nellore)_ కాపులను బీసీల్లో చేర్చుతూ ఏపీ  కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా బీసీ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.. గత రెండు రోజుల నుంచి నెల్లూరులో బీసీ సంఘాల ఆందోళన చేస్తున్నాయి.. ఇవాళ కలెక్టరేట్ ముట్టడికి యత్నించాయి.. భారీ ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. సమాజంలో ఆర్దికంగా బలంగా ఉన్న కాపులను బీసీల్లో చేర్చడం ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం
జరుగుతోందన్నారు.. బీసీల పొట్టకొట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యత్నించడం దుర్మార్గమన్నాడు.. బీసీ
ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపులను దగ్గరికి చేర్చుకోవడం కోసం బీసీల గొంతు కోశాడని బీసీ సంఘం జిల్లా
అధ్యక్షులు సంపత్ రాజు మండిపడ్డారు..

SHARE