భ‌విష్య‌త్ లో చంద్ర‌బాబుకు చుక్క‌లే.. – వైసీపీ రాష్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న‌

117

The bullet news (kovur)- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై నేరుగా విమర్శలు సంధించడంలో ఎప్పుడూ ముందుడే మాజీ మంత్రి, వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి చంద్రబాబు తీరుపై పైరయ్యారు.. కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఆయన నవరత్నాలు బ్రౌచర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడిపై, టీడీపీ నేతలపై మండిపడ్డారు.. నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలు వక్రీకరించి టీడీపీ బచ్చాలు లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు.. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా నంద్యాల నడిబొడ్డున వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన సిఎం చంద్రబాబుకి దేశంలో ఉన్న శిక్షల్ని విధించినా తక్కువేనన్నారు.. వెన్నుపోటు బాబుకి నంద్యాల ఓటర్లు బుద్ధిచెప్పబోతున్నారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి లాగే
వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారికి రాజీనామా చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు..

SHARE