అంతా వైఎస్‌ హయాంలోనే..

112

The Bullet News (POLITICAL )_  రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ను పెంచి పోషించింది వైఎస్ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో ఇవాళ జరిగిన టీటీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఆయన మట్లాడుతూ అక్రమ బాక్సైట్‌ను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ఇటువంటి సమయంలో నక్సల్స్ దాడి జరగడం దురదృష్టకరమన్నారు. కిడారి, సోముల పై దాడి బాధాకరమన్న బాబు.. ఒకరిపై ఒకరు పోటీ చేసినా విభేదాలు వీడి పార్టీ కోసంకలిసి పని చేశారని గుర్తుచేశారు.

48 గంటల్లో..
అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంవీవీఎస్‌ మూర్తి భౌతికగాయాన్ని భారత్‌ తెచ్చేందుక ఇంకా 48 గంటలు పట్టవచ్చని చంద్రబాబునాయుడు అన్నారు. మూర్తికి పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. మూర్తి మరణం విశాఖ జిల్లాతోపాటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబునాయుడు అన్నారు.

SHARE