నెల్లూరు న‌గ‌ర మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ పై మ‌ద్రాస్ పోలీస్ క‌మిష‌న‌రేట్ లో చీటింగ్ కేసు న‌మోదు..

162

The bullet news (Nellore)_ నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అతని సోదరుడు జ‌లీల్, అనిల్ కోనేరుల‌పై మద్రాస్ కమిషన్ రేట్ లో నమ్మకద్రోహం, మోసం, ఆర్దిక వ్యవహారాల అవకతవకలకు పాల్ప‌డ్డారంటూ మద్రాస్ సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ) క్రైమ్ నెంబర్ 431-2017 అండర్ సెక్షన్ 406,420, 506, రెడ్ విత్ 120-బి, ఐపీసీ కేసులు నమోదయ్యాయి.. మేయ‌ర్ నిర్వ‌హిస్తున్న‌ స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42 కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ మద్రాస్ చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మేయర్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.

SHARE