చూయింగ్‌గమ్‌ నమిలినందుకు అధికారి సస్పెండ్

48

The bullet news (Banguluru)-  బెంగళూరులో ఒక ప్రొబెషనరీ ఐఎఎస్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రభుత్వ కార్యక్రమంలో కన్నడనాడు గీతాన్ని ఆలపిస్తున్న సందర్భంలో చూయింగ్‌గమ్‌ నమిలినందుకు సస్పెన్షన్‌ విధించారు. వివరాల్లోకి వెళితే కర్నాటకలోని తుమకూరులోని సిరాలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పొల్గొన్నప్రొబెషనరీ ఐఎఎస్‌ అధికారి ప్రీతి గెహ్లాట్ చూయింగ్ గమ్ నములుతూ కూర్చున్నారు. ఆ సమయంలో కన్నడ రాష్ట్రగీతం ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకం వేశారు. తరువాత కన్నడ రాష్ట్రగీతం పాడుతున్న సందర్భంగా సీఎంతో పాటు ఇతర మంత్రులు ప్రముఖులు గౌరవంగాలేచి నిలుచున్నారు. ప్రీతి కూడా లేచి నిలుచున్నప్పటికీ, చూయింగ్ గమ్ నములుతూనే ఉన్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపధ్యంలో పలు విమర్శలు ఎదురయ్యాయి. దీంతో కర్నాటక ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

SHARE