తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు

103

The Bullet News ( Atmakuru) _ ఆత్మకూరు పట్టణంలోని బిసి బాలుర వసతి గృహంలో బాలల దినోత్సవ వేడుకలు తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ఘనంగా నిర్వహించారు.. బాలుర సమక్షంలో కేక్ కట్ చేసి వారికి పంచి పెట్టారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై టి ఎన్ ఎస్ ఎఫ్ పోరాడుతుందన్నారు.. దాంతో పాటు ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టె పథకాలను సైతం వారికి వివరించే బాధ్యత కూడా తమ మీద ఉందన్నారు.. మాజీ మంత్రి, రాష్ట ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం లో పనిచేస్తూ విద్యార్థులకు అండగా ఉంటామన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చల్లా మధు సూధన్, ఆత్మకూర్ పట్టణ అధ్యక్షుడు మారుతి, కార్యదర్శులు నాయుడు, పురుషోత్తం, బాలాజీ, తేజ పాల్గొన్నారు..

SHARE