విజయవాడలో సివిల్స్ క్రికెట్…

79

THE BULLET NEWS (VIJAYAWADA)-మూలపాడులోని క్రికెట్‌ స్టేడియంలో ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌ 2017 -18ను నిర్వహిస్తున్నట్టు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. శనివారం నుంచి వచ్చే నెల అయిదో తేదీ వరకు క్రికెట్‌ పోటీలు, జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు అథ్లెటిక్‌ పోటీలు నిర్వహి స్తామన్నారు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అధికారులు, 11 .ప్రాంతీయ క్రీడా సంఘాలకు చెందిన 800 క్రీడాకారులతో మార్చ్‌ఫాస్ట్‌ చేస్తారన్నారు.

SHARE