కావలి లో “క్లారిటీ” గోల

140

The Bullet news ( kavali )-

కనుచూపు మేరలో ఎన్నికలు లేకపోయినా ఆ నియోజకవర్గంలో ఇద్దరి నేతల మద్య టిక్కెట్ గోల మొదలైంది.. కన్ ప్యూజ్ లో ఉన్న ఆ ఇద్దరూ క్లారిటీ కోసం అధినేతను సంప్రదించే పనిలో పడ్డారు.. అనుచరులు మాత్రం తమ నాయకుడికే టిక్కెట్ కన్ఫామ్ అయిందంటూ హడావుడి మొదలుపెట్టారు.. అధినేత ఎవరికి హామీ ఇచ్చారు..? నేతల మదిలో ఏముంది..? ఇంతకీ అక్కడి వైసీపీలో ఏం జరుగుతోంది..? ఇవన్నీ తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే..

వాయిస్ ఓవర్ : కావలి నియోజకవర్గం నుంచి రామిరెడ్గి ప్రతాప్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు..2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ది బీదా మస్తాన్ రావుపై 5వేల పైచిలుకు ఓట్లతో రామిరెడ్డి విజయం సాధించారు.. ఆయన విజయానికి అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి సహకరించారు.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన కాటంరెడ్డికి జగన్ చివరి నిమిషంలో హ్యాండిచ్చారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తానంటూ కాటంరెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.. దీంతో రామిరెడ్డి గెలుపు కోసం కాటంరెడ్డి క్రుషి చేశారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయనకిచ్చి హామీ అ్రడస్ లేకుండా పోయింది..

అప్పటి నుంచి కాటంరెడ్డి టిక్కెట్ కోసం పావులు కదుపుతూ వచ్చారు. ప్రజల్లో తిరుగుతూ స్వంత పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు.. ఈ వ్యవహారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి రుచించపోవడంతో వీరిద్దరి మధ్య అంతర్గత కుమ్ములాటలు స్టాటయ్యాయి.. ఇదే సమయంలో కావలి నియోజకవర్గంలొ జరిగిన ప్లీనరిలో సమావేశంలో 2019లో కావలి వైసీపీ అభ్యర్ది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డేనని ఎంపీ మేకపాటి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి అనుచరులు మండిపడ్డారు కూడా..

సీన్ కట్ చేస్తే..
వచ్చే ఎన్నికల్లో కావలి టిక్కెట్ ఇవ్వాలంటూ కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు.. పార్టీ బలోపేతం గురించి చర్చించిన జగన్ టిక్కెట్ విషయం దగ్గరికి వచ్చేసరికి తనదైనశైలిలో నవ్వుతూ ఇంకా టైముంది కదన్నా.. చూద్దాం అంటూ మాట దాటేశారట.. ఇదే సమయంలో రూ.30కోట్లు ఖర్చుచేసే కెపాసిటి ఉంటేనే టిక్కెట్ అని జగన్ అన్నారనే వార్తలు కూడా హల్ చల్ చేశారు.. కాటంరెడ్డి అనుచరులు మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్ కన్ఫామ్ అయిందంటూ హడావుడి మొదలుపెట్టారట.. ఇదంతా ఎమ్మెల్యే రామిరెడ్డికి
నచ్చపోవడంతో టిక్కెట్ పై క్లారిటీ ఇవ్వాలంటూ పార్టీ పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డిని గట్టిగానే నిలదీసినట్లు సమాచారం. రేపో, ఎల్లుండో జగన్ తో భేటి అయ్యి టిక్కెట్ పై క్లారిటీ తీసుకోవాలని రామిరెడ్డి భావిస్తున్నారట.. ఇదిలా ఉంటే కావలి టిక్కెట్ వ్యవహారంపై జగన్ నెల్లూరు జిల్లా పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మేకపాటి, జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డితో ఇది వరకే చర్చించినట్లు తెలుస్తోంది..

SHARE