అందరి సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం – గూడూరు ఎమ్మెల్యే సునీల్

95

The Bullet News ( Gudur ) – ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ ఇవాళ గూడూరు మండలం పోటుపాళెం గ్రామ పంచాయతీలో పర్యటించారు..
మొదట పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
హరిజనవాడ, ఛలివేంద్రగుంట, శ్రీనివాస గిరిజనకాలనీ, రోటరీనగర్ లలో పర్యటించి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు చెప్పే సమస్యలను ఓపికగా విన్న ఆయన అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు.. ఎవ్వరు అభివృద్ధి చెయ్యలేని విధంగా గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. అంతకు ముందు ఎమ్మెల్యే కి పోటుపాలెం పంచాయతీ వాసులు ఘన స్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, పాల్గొన్నారు…

SHARE