ప్రకృతి విధ్వంసకుడు చంద్రబాబు- ఎమ్మెల్యే కాకాణి ఫైర్

114

THE BULLET NEWS (NELLORE)-రాష్టంలో రైతు వ్యతిరేకపాలన కొనసాగుతోందని రాష్ట వైసీపీ రైతు సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి మండిపడ్డారు.. నెల్లూరు పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.. సర్ ఆర్థర్ కాటన్ తర్వాత నీటిసమస్యలు, ప్రాజెక్టుల కోసం పరితపించిన నేత వై ఎస్సార్ మాత్రమేనన్నారు. నెల్లూరు జిల్లాలో నీతిమాలిన నీటిరాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు..

చంద్రబాబు హయాంలో ప్రకృతి విధ్వంసం జరుగుతోందన్నారు.. ఆయన ప్రక్రుతి విధ్వంసకుడిని నాగిరెడ్డి అభివర్ణించారు.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ టిడిపిలో చేరితేనే సాగునీరు అందిస్తామని రైతులను టిడిపి నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.సోమశిల రిజర్వాయర్ సామర్ధ్యం పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి దేనన్నారు.. వ్యవసాయం, సాగునీటిపై కనీస అవగాహనలేని వారిని సాగునీటి అధ్యక్షులు గా నియమించిన నీతిమాలిన చరిత్ర చంద్రబాబుదేనని కాకాణి ధ్వజమెత్తారు..

SHARE