అబ‌ద్దాలు, వెన్నుపోటు రాజ‌కీయాలే చంద్ర‌బాబు నాయుడి ఆయుదాలు – వైసీపీ ఎంపీలు

87

The Bullet news ( Nellore) _ అబద్దాలను ఆయుదంగా చేసుకుని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఒంగోలు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షులు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డితో కలిసి వారు మాట్లాడారు.. రాష్టానికి మేలు జరిగితే అది చంద్రబాబు ఖాతాలో వేసుకోవడం… నష్టం వాటిల్లితే అది ఎదుటివారి మీద రుద్దడం బాబుకు బాగా అలావాటైపోయిందని మండిపడ్డారు.. ఈనెల ఏడున పోలవరాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శిస్తామన్నారు.. పోలవరం వ్యవహారంలో కేంద్రంపై నిందలు వేసి చంద్రబాబు నాయుడు చేసినతప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మేనిపెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నారని వారు మండిపడ్డారు.. కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం విషయాన్ని పక్కదారి పట్టించేదుకు కాపు రిజర్వేషన్ల వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొచ్చారన్నారు.

SHARE