చంద్రబాబు బీసీల ద్రోహి – సీమాంద్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య

82

The Bullet News ( Nellore) _బీసీ రిజర్వేషన్ల కోటాలో కాపులను చేర్చే ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఆదివారం నెల్లూరులో బీసీ సీమాంధ్ర సంక్షేమ సంఘం ఆందోళన నిర్వహించింది.. ఆ సంఘ రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య ఆద్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పలు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి…విఆర్సీ సెంటర్ లో ఏర్పాటు చేసిన ధర్నానుద్దేశించి రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ బీసీల అణచివేతకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.. బీసీల ప్రతినిధులు గా చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న బీసీ మంత్రులు ,ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వానికి తమ నిరసన ను తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు భారీగా పాల్గొన్నారు..

SHARE