రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన బాబు

116

The  bullet news (Amaravathi) – ఏపీలో ఖాళీఅయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే వైకాపా తన అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. నామినేషన్ గడువు సోమవారంతో ముగియనుండగా అధికార టీడీపీ మాత్రం తమ అభ్యర్థులను ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ రాజసభ్య అభ్యర్థులను అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌ను కొనసాగించాలని సీఎం. ఇక ఎస్సీ సమాజానికి వర్గానికి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్యకు అవకాశం దక్కింది. టికెట్ కోసం పలువురు ఆశావాహులు ప్రయత్నించినా చివరకు అదృష్టం వీరిని వరించింది.

 టీడీపీ ఏపీ అధ్యక్షడు కళా వెంకట్రావు, ఆర్థికమంత్రి యనమలతో భేటీ అనంతరం చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చారు. కాసేపట్లో అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆఖరు నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప ఏలాంటి మార్పు ఉండదని అంటున్నారు. రాజ్యసభ సీటును ఆశిస్తున్న నేతలతో చంద్రబాబు ఇప్పటికే విడివిడిగా మాట్లాడారు. మొత్తానికి మధ్యాహ్నం కల్లా అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీలోని ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాల్లో శాసనసభలో బలబలాలను బట్టి తెలుగుదేశానికి రెండు, వైకాపాకు ఒకటి దక్కుతుంది. మూడో స్థానానికి కూడా టీడీపీ పోటీ చేస్తుందనే ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. వైకాపా తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు స్థానాలతోపాటు మొత్తం 16 రాష్ట్రాల్లో 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముగియనుండటంతో ఆయా స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి మార్చి 5 న నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ జారీచేసింది.

SHARE