రాజ‌కీయాల్లో రంగ‌స్థ‌ల న‌టుడు సీఎం చంద్ర‌బాబు -ఎమ్మెల్యే కాకాణి విమ‌ర్శ‌

94

The bullet news(Nellore)- రాజ‌కీయ రంగస్థ‌ల న‌టుడు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడంటూ వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన జడ్జెట్ పై చంద్రబాబు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారని విమర్శించారు. బడ్జెట్ తర్వాత రాష్ట ప్ర‌జ‌ల ఆగ్ర‌హావేశాలు చూసిన చంద్రబాబు నాయుడు డ్రామాలు స్టార్ట్ చేశారంటూ మండిపడ్డారు. బడ్జెట్ లో ఏపీ కి నిధులు రాకపోవడానికి చంద్రబాబు అవినీతే కారణమని బీజేపీ నాయకులు విమర్శిస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు నోరుమెదపడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. రాష్ట ప్రయోజనాలను పణంగా పెట్టి స్వంత ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. పెట్టుబ‌డుల కోసమంటూ విదేశాల‌కు తిరుగుతూ ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసనను చూసి రాష్ట ప్రజలు నవ్వుకుంటున్నారని, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఇలాంటి ద్వంద వైఖరిని అనుసరించడం చంద్రబాబు నాయుడి అసమర్దతకు నిదర్శమన్నారు..

SHARE