రాష్టాభివృద్ది కోసం సీఎం చంద్రబాబు యువ‌కుడిలా క‌ష్ట‌ప‌డుతున్నారు – మంత్రి నారా లోకేష్

135

The bullet news (Nellore)-  అరవై ఏడేళ్ల వయస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై  నాలుగేళ్ల యువకుడిలా రాష్టాభివ్రుద్ది కో్సం పనిచేస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారాలోకేష్ అన్నారు.. నెల్లూరు సిటి నియోజకవర్గంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఎన్టీయార్ గ్రుహ సముదాయాన్ని మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేష్ మాట్లాడారు. తెలుగు రాష్టాల్లో ఎక్కడాలేని విధంగా షేర్ వాల్ టెక్నాలజితో నెల్లూరులో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.. ఇళ్లు లేని ప్రతి నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్టంలో ఐటీ రంగాన్ని
వేగంగా అభివ్రుద్ది చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఐటీ రంగాన్ని ఏపీకి కేరాఫ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. .ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కిష్ణారెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక అనురాధ, జడ్ ఎస్ శివప్రసాద్ పాల్గొన్నారు..

SHARE