ఆమరణ దీక్ష చేస్తా – సీఎం రమేష్

83

THE BULLET NEWS (KADAPA)-కడప స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిచక పోతే అన్ని వర్గాలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం సముఖంగా లేదనిపిస్తోందని రమేష్ తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో మంత్రి అపాయింట్మెంట్ అడిగానని పేర్కొన్నారు.  ఆంధ్ర ప్రదేశ్  ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా  వైసీపీ రాజీనామాల డ్రామా  కొనసాగుతోందని ఆరోపించారు. కనీసం రాజీనామాలు ఆమోదింపజేసుకోలేదని ఆరోపించారు. వారి రాజీనామాలు  ఆమోదించానా.. ఎన్నికలు రావన్నారు.  కర్ణాటకలో ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తే 24 గంటల్లో ఆమోదించారు. ఏపీకి ఆ రూల్స్ ఎందుకు వర్తించవని ప్రశ్నించారు.  మళ్ళీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతామని తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో సత్తా చాటుతామన్నారు. పొలవరం పనులను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పోలవరం.. ఆంధ్ర, రాయలసీమకు ఒక వరమని తెలిపారు. ఆంధ్రాలో బీజేపీకి అవకాశం లేదని పేర్కొన్నారు.  వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు రాజకీయ నిర్ణయం చాలు అన్నారు. నిధులు అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

SHARE