దమ్ముంటే ఉపఎన్నికలకు రండి.. మా సత్తా చూపిస్తాం.. – మంత్రి సోమిరెడ్డి సవాల్..

189

The bullet news (Venkata chalam)_ సాధారణ ఎన్నికలు ఏడాది కంటే తక్కువగా ఉంటే ఉపఎన్నికలు రావని.. ఆ దైర్యంతోనే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామని డ్రామాలాడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.. ఉపఎన్నికలు వస్తే తమ సత్తా ఎంటో చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు.. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు.. ఈ సందర్బంగా ఆయన ఎన్టీయార్ సేవలను కొనియాడారు. పక్కా గృహాలకు శ్రీకారం చుట్టినా..రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టినా ఇవన్నీ ఎన్టీయార్ కే చెల్లుతాయన్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఇందిరా గాంధీని ఎదుర్కొన్న దమ్మున నేత దివంగత ఎన్టీయార్ అన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఉంటే తమకు ఇబ్బందులు తప్పవనే ఈర్ష్యతో కొందరు ఢిల్లీ పెద్దలు ఏపీపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. ఎన్నికలైనా ఏడాదికి తెలంగాణలో బీజేపీ నేతలు టీడీపీతో తెగదెంపులు చేసుకున్నా… నిర్మల సీతారామన్, సురేష్ ప్రభుని రాజ్యసభకు పంపి మిత్ర ధర్మం
పాటించామన్నారు.. కానీ బిజేపీ మాత్రం మిత్రధర్మాన్ని మరిచిపో్యి ప్రవర్తించిందన్నారు.. ప్రత్యేకహోదా పై కేంద్రంపై
పోరాటం చేయకుండా.. వీధుల్లో తిరుగుతన్నారని ఎద్దేవా చేశారు.. అవిశ్వాసం పేరుతో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాని బెడ్
రూమ్, కిచెన్ రూముల్లో తిరుగుతున్నారన్నారు.. జగన్ ప్రధాని మోడీని పలెత్తి మాటనకుండా చంద్రబాబును టార్గెట్
చేస్తున్నారని విమర్శించారు..

SHARE