The Bullet news ( Gudur) – పోలీసులు సమాజానికి వెన్నుముక లాంటి వారని, విధి నిర్వహణ లో వీర మరణం పొందిన వారి సేవలను స్మరించుకోవటం మా బాధ్యతని గూడూరు టు టౌన్ ఎస్ ఐ నరేష్ అన్నారు.. పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని గూడూరు ఎబివిపి ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎస్ ఐ నరేష్ మాట్లాడుతూ విధి నిర్వహణ లో అసువులు బాసిన వారిని యువత ఆదర్శంగా తీసుకొని దేశ రక్షణ కోసం పోరాడాలన్నారు. ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ మాట్లాడుతూ సమాజానికి పోలీసులే హీరోలన్నారు.. శాంతి భద్రతల పరిరక్షణ లో వారి పాత్ర కీలకమన్నారు.. వారి జీవితాన్ని సమాజానికి అంకితం చేస్తారన్నారు.. ఎన్ని ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటు సమాజ సేవ చేస్తుంటారన్నారు…

SHARE