గవర్నర్ బిజెపిని ఆహ్వానిస్తే కాంగ్రెస్ ముందు రెండు అప్షన్స్

127

The Bullet News ( Karnataka)_ కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయమే కీలకం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. రిసార్ట్స్, హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేసి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తుంటే.. అవసరానికి సరిపడిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంత హైడ్రామా నడుస్తుండగా.. గవర్నర్ మాత్రం మౌనం వహించడంపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఒకవేళ, గవర్నర్ నిర్ణయం బీజేపీకి అనుకూలంగా ఉంటే రెండు విధాలుగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానిస్తే.. రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎదుటే ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన నిర్వహించాలని కూడా కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలిసింది. కుదరని పక్షంలో సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటానికి దిగాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
SHARE