బడ్జెట్ పై కాంగ్రెస్ నాయ‌కులు శివాచారి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌

42

The bullet news (Nellore)_  బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సెల్ రాష్ట నాయ‌కులు శివాచారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ఓ, ఎన్ ఎస్ యుఐ నాయ‌కులు కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ను ద‌గ్దం చేశారు.. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరానికి నిధులు, రైల్వేజోన్, రెవెన్యూ లోటుభర్తీ ప్రస్తావన లేదని మండిపడ్డారు. బీజేపీతో పాటు టీడీపీ, వైసీపీలు కూడా నైతిక బాధ్యత వహించాలని శివాచారి డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చారని ఇంకెన్నాళ్లు చెబుతారు? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీల బలహీనతలే ఏపీకి శాపంగా మారాయని, ఏపీ ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలని శివాచారి డిమాండ్ చేశారు. అనంత‌రం ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్య‌క్షులు కేశ‌వ నారాయ‌ణ కూడా మాట్లాడారు..

SHARE