జడేజా భార్యపై కానిస్టేబుల్‌ దాడి…

74

THE BULLET NEWS (GUJARAT)-టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా భార్యపై ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. షాపింగ్‌కు బయల్దేరిన జడేజా భార్య రీవా సోలంకి నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు, రాంగ్‌రూట్‌లో వస్తున్న కానిస్టేబుల్‌ సంజయ్‌ అహిర్‌ పల్సర్‌ మోటార్‌సైకిల్‌ ఎదురెదురుగా స్వల్పంగా ఢీకొన్నాయి. దెబ్బలేమైనా తగిలాయా? అని ఆ కానిస్టేబుల్‌ను రీవా వాకబు చేసేలోగానే అతడు తీవ్ర ఆగ్రహంతో దాడికి దిగాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

 

ఓ దశలో ఆమె జుట్టు పట్టుకుని కొట్టబోగా తాము రక్షించామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లిన రీవాను జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ కలుసుకుని స్వయంగా ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అనంతరం పోలీసులు కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశారు. మహిళపై దాడి చేయడం తీవ్రమైన నేరమని, దీనిపై విచారణ జరిపి సంజయ్‌ అహిర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ తెలిపారు. కాగా, 2017లో కూడా రీవా ఓ యాక్సిడెంట్‌ వివాదంలో చిక్కుకుంది.

SHARE