కానిస్టేబుల్ అక్రమ సంబంధం…పట్టుకున్న భార్య…

182

THE BULLET NEWS (SIDDIPET)-తెలంగాణ పోలీసు శాఖలో అక్రమ సంబంధాల గుట్టు ఒక్కొక్కటిగా రట్టు అవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. వీరిలోకి పోలీసులు కూడ వస్తుండడం వ్యవస్థ ప్రతిష్టపై మచ్చ పడుతోంది. ఇటీవలే ఓ మహిళా ఎస్పీతో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు పలు ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ మరో మహిళతో సహజీవనం చేస్తున్న ఘటన బయటకొచ్చింది. మొదటి భార్య రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ కి మమతతో 2006లో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా మద్దూరు పీఎస్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు.

ఇదిలా ఉంటే గాగిలాపూర్ కు చెందిన అనూష భార్య..భర్తల గొడవల విషయంలో రమేష్ ని సంప్రదించింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం..ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. ఈ తరుణంలో మమత..రమేష్ ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గత ఆరు నెలల క్రితం చేర్యాల సీఐ జోక్యం చేసుకుని రమేశ్..మమతలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రశాంత జీవితం గడపాలని సీఐ సూచించారు. కానీ రమేశ్ మాత్రం అనూషతో సహజీవనం కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న మమత రెడ్ హ్యాండెండ్ గా పట్టుకోవాలని భావించింది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం మమత..తల్లిదండ్రులు..ఇతరులతో మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంది. రమేష్..అనూషలు ఉంటున్న ఇంటికి చేరుకుని ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వారిద్దరినీ బయటకు ఈడ్చి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఇరువురినీ పీఎస్ కు రప్పించారు. ఈ సమస్య ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

SHARE