గ్రామీణ బాలికలకు కోరమాండల్ పెర్టిలైజర్స్ సేవలు అభినందనీయం – జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి

115

The bullet news (Nellore)_సీఎస్ఆర్ నిధుల ద్వారా కోరమాండల్ పర్టిలైజర్స్ గ్రామీణ పాఠశాలల బాలికలకు ప్రోత్సాహకాలు అందజేయడం అభినందనీయమని జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు.. నెల్లూరు నగరంలోని పద్మావతి కమ్యూనిటీ హాల్ లో కోరమాండల్ కంపెనీ ఆద్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రతిభావంతమైన బాలికలకు ప్రోత్సాహాకాలు అందజేశారు.. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ బాలికల డ్రాపౌట్స్ నివారించేందుకు కోరమాండల్ కంపెనీ చేస్తున్న సహకారం సంతోషకరమన్నారు..కోరమాండల్ జనరల్ మేనేజర్ వైవీ కిష్ణారెడ్డి మాట్లాడుతూ పర్టిలైజర్స్ రంగంలో దూసుకెళ్తున్న కోరమాండల్ గ్రామీణ బాలికలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.. మొదటి బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతిగా రూ.3500 ఇస్తున్నామన్నారు..46 మండలాలోని 52 పాఠశాలల్లో 104 మంది విద్యార్దులకు ఈ ప్రోత్సహకాలు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు.. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణాలో ఈ తరహా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, మొత్తం 28 జిల్లాల్లో సీఎస్ఆర్ నిదుల ద్వారా విద్యాభివ్రుద్దికి పాటుపడుతున్నట్లు ఆయన వివరించారు.. బాలికల ప్రోత్సకాల కోసం ఇవాళ రూ.4.50లక్షల నిధులు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. తమ కంపెనీకి రైతులే వెన్నుముక అన్న ఆయన నిరుపేద బాలికల కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.. మరో పక్క కోరమాండల్ కంపెనీ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని విద్యార్దినీలు, వారి తల్లిదండ్రులు ప్రశంసించారు.. కోరమాండల్ కంపెనీకి రుణపడి ఉంటామన్నారు.. ఈ కార్యక్రమంలో ఏజీఎం సాంబశివరావు, డివిజనల్ అధికారి సాయిప్రసాద్, సీనియర్ ఆగ్రోమెస్ట్ రామరావు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లింగారెడ్డి, అసిస్టెంట్ మార్కెటింగ్ అధికారి నాగ శివారెడ్డి, అనిల్ కుమార్, తదితరులు పాల్గోన్నారు..

SHARE