పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు – మంత్రి కె.ఎస్.జవహర్

124

 

The Bullet News ( Pasivedala ) – దేశానికి పల్లెలు పట్టుకొమ్మలని అలాంటి గ్రామాలను స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ అన్నారు. కొవ్వూరు మండలం పశివేదలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఘన,వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. ర్ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ద్వారా గ్రామాలన్నీ స్వచ్ఛంగా తీర్చి దిద్దేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. దత్తత గ్రామాలన్నీ అభివృద్ధి చేసేందుకు స్థానిక నాయకుల సహకారం మరువలేనిదన్నారు..ప్రధానంగా సేంద్రియ ఎరువుల వినియోగం పెరిగితే ఆరోగ్య కరంగా జీవించ వచ్చన్నారు.. అనంతరం చెత్త నుంచి తయారు చేసిన సేంద్రియ ఎరువుల ప్యాకేట్లను పశివేదల రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, సర్పంచ్ బేతిన కాశీ అన్నపూర్ణ, ఎంపీపీ వాడవల్లి రాజ్యలక్ష్మి, జడ్పీటీసీ గారపాటి శ్రీదేవి పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

SHARE