రాపూరులో రోడ్డెక్కిన సీపీఎస్ ఉద్యోగులు

186

The bullet news (Rapur)- సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డెక్కారు.. స్థానిక ఎమ్మార్వో కార్యాలయాల వద్ద తన నిరసనలు వ్యక్తం చేశారు.. రాపూరులోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీపీఎస్ ఉద్యోగులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఎన్జీవో అధ్య‌క్షులు విజ‌య్ కుమార్, యుటిఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ సీపీఎస్ విధానం వ‌ల్ల రాష్ట వ్యాప్తంగా దాదాపు 1,87,000 మంది న‌ష్ట‌పోతున్నార‌న్నారు.. జిల్లాలో దాదాపు 12వేల మంది ఉన్నారన్నారు. సీపీఎస్ విధానంలో నిర్దిష్ట పింఛన్ వచ్చే అవకాశం లేదని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పింఛన్, కుటుంబ పింఛన్, పీఎప్ సౌకర్యాలు సీపీఎస్ అమలుతో ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపింఆరు.. సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేసి పాత పించ‌న్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాపూరు మండ‌ల ఎన్జీవో అధ్య‌క్షులు దేవ‌కుమార్, యుటిఎఫ్ మండ‌ల కార్య‌ద‌ర్శి మ‌స్తాన‌య్య‌, ఏపీటీఎఫ్ 1938 మండ‌ల అధ్య‌క్షులు గుప్తా, ఏపీటీఫ్ 1938 మండ‌ల కార్య‌ద‌ర్శి అక్రం, ఏపీటీఎఫ్ 257 మండ‌ల అధ్య‌క్షులు ఎంవీ నారాయ‌ణ‌, ఏపీటీఎఫ్ మండ‌ల కార్య‌ద‌ర్శి వినోద్, ఎస్టీయూ మండ‌ల గౌర‌వాధ్య‌క్షులు శ్రీనివాసుల‌తో పాటు సుమారు 100 మంది దాకా ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

SHARE