నెల్లూరుజిల్లా క్రైమ్ రేట్ త‌గ్గిందోచ్..

98

The bullet news (Nellore)- వరుస దొంగతనాలకు చెక్ పెట్టారు.. వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేశారు.. ఎర్రచందనం, సిలికా, క్రికెట్ బెట్టింగ్ ల పునాదులు కదిలించారు.. సామాన్యులను మోసం చేస్తున్న బఢా మాఫియాలను జైళ్లకు పంపారు.. మొత్తంగా నెల్లూరుజిల్లాలో క్రైమ్ రేట్ ను తగ్గించారు నెల్లూరు ఎస్పీ పిహెచ్ డీ రామకిష్ణ.. సంవత్సర క్రైమ్ రివ్యూలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.

గడిచిన ఏడాది కాలంలో పలు సంచలనాత్మక కేసులను శోధించి ఛేదించగలిగామని ఎస్పీ వెల్లడించారు. ముఖ్యంగా రాష్టంలోనే కాదుదేశవ్యాప్తంగా సంచలనంకల్గించిన క్రికెట్ట బెట్టింగ్ డాన్ కిష్ణసింగ్ తో సహా రాజకీయ ప్రమేయం ఉందన్న కోణంలో ప్రజా ప్రతినిధులను సైతం విచారించి ఈ మాఫియా పై ఉక్కుపాదం మోపగలిగామన్నారు.. ఎర్రచందనం వ్యవహారంలో అంతర్జాతీయ స్మగర్ల ఆటకట్టించడంతో పాటు ప్రమేయమున్న వారిని జైళ్లకు పంపేవరకు స్థానిక పోలీసులు, టాస్క్ పోర్సు కూంబింగ్ దళాలు విశ్రమించక పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో అంతర్లీనంగా వేళ్లూరుకున్న గుట్కా, ఇతర మాదక ద్రవ్యాలను ఈ ఏడాదిలో నిలువరించగలిగామన్నారు..

నిషేదిత మాదక ద్రవ్యాల రవాణాను అన్ని వైపులా నుంచి అడ్డుకట్టవేడయంతో పాటు సూత్ర పాత్రదారులను కటకటలాల్లోకి పంపగలిగామన్నారు.. ఇష్టానుసారంగా తరలిపోతున్న సిలికా, ఇసుక అక్రమ రవాణాను అదుపు చేయగలిగామని ఎస్పీ క్రైమ్ రిపోర్టులో వెల్లడించారు.. చిల్లర దొంగతనాలు, దాడులు, చైన్ స్నాచింగ్లు, చోరీలు, హత్యాయత్నాలు వంటివి కూడా నియంత్రించగలిగామన్నారు.. వచ్చే సంవత్సరంలో క్రైమ్ రహిత నెల్లూరుకు క్రుషి చేస్తామన్నారు.. మరో వైపు ఇంతస్థాయిలో మొదటి స్థాయిలో క్రైమ్ రిపోర్టును వెల్లడించడం ఇదే నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం..

SHARE