క్రిటికల్ సర్జరీలకు కేరాఫ్ సింహపురి

89

The bullet news (Nellore)- క్రిటికల్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించడంలో సింహపురి వైద్యశాల కేరాఫ్ గా నిలుస్తోంది.. మెదడులో విస్తరించి ఉన్న 600 గ్రాముల కణితిని సింహపురి డాక్టర్లు విజయవంతంగా తొలగించారు.. సింహపురి వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యూరో సర్జన్ డా.వెంకటేశ్వర ప్రసన్న మాట్లాడారు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతా కు చెందిన తాజుద్దీన్ షేక్ గత కొన్ని నెలలుగా విపరీతమైన తలనొప్పితో, నరాల బలహీనతతో, ఫిట్స్ తో బాధపడుతూ కోల్ కతా, చెన్నై హాస్పటల్స్ తిరిగినా ప్రయోజకం లేక చివరి ప్రయత్నం కింద నెల్లూరు సింహపురికి వచ్చారన్నారు.. అందుకు అవసరమైన స్కాన్ పరీక్షలు నిర్వహించడంతో మెదడులో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిని వెంటనే తొలగించాలని లేని పక్షంలో ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులకు వివరించి, వారి అనుమతితో ఈ ఆపరేషన్ చేశామన్నారు.. మెదడులో 600 గ్రాముల అతి పెద్ద కణితి చిన్న మెదడు నుండి పెద్ద మెదడు వరకు వ్యాపించి ఉందన్నారు. సుమారు 8 గంటలపాటు ఈ ఆపరేషన్ ను నిర్వహించామని, ఆపరేషన్ సమయంలో ఎంతో రక్తస్రావమయ్యిందని, అయినప్పటికీ మత్తు వైద్య నిపుణులు డా.రాజమోహన్ రెడ్డి ఎంతో నైపుణ్యంతో బి.పి. ని మైంటైన్ చేస్తూ ఈ ఆపరేషన్ ను నిర్వహించామన్నారు. ప్రస్తుతం రోగి పరిస్థితి బాగా మెరుగు పడిందని, తనవారిని గుర్తు పట్టే స్థితికి వచ్చాడాన్నారు.. ఈ రోజు డిశ్చార్జ్ చేసి కోల్ కతా పంపుతున్నామన్నారు. సింహపురిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులో ఉండడం వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు. సమావేశంలో న్యూరో సర్జన్ డా.సతీష్ వందనపు, న్యూరాలజిస్ట్ డా.దీక్షాంతి నారాయణ్, బాధితుడు తాజుద్దీన్ షేక్ తదితరులు పాల్గొన్నారు.

SHARE