సీఎస్ఆర్ నిధుల ద్వారా మునిసిపల్ స్కూల్ లో మౌలిక వసతులు – మంత్రి నారాయణ

74

THE BULLET NEWS-సీఎస్ ఆర్ నిదుల ద్వారా
మునిసిపల్ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతుల కల్పపనకు క్రుషి చేస్తున్నట్లు ఏపీ పట్టణ పురపాలక శాఖా మంత్రి పొంగూరునారాయణ తెలిపారు.. ఇవాళ ఆయన నెల్లూరులోని మునిసిపల్ పాఠశాలలో మౌలిక వసతులను ఆయన
తనిఖీచేశారు.. సీఎస్ ఆర్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన పర్నీచర్ ను ఆయన స్కూల్స్ కు అందజేశారు.. మరుగుదొడ్లు, మౌలిక వసతుల గురించి విద్యార్దులను అడిగి
తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మౌలిక వసతులు, మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోందన్నారు. మరుగుదొడ్లు నిర్మాణం
మాత్రమే కాకుండా వాటిని వినియోగించే విధంగా నీటి వసతి, మురుగు పారుదల వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మరుగుదొడ్ల వినియోగం పై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తామన్నారు..

SHARE