క‌త్తిసుత్తి ఇక‌నైనా ఆపండి.. – వైసీపీ నేత‌ల‌పై మంత్రి సోమిరెడ్డి పైర్

169

క‌త్తిసుత్తి ఇక‌నైనా ఆపండి.. – వైసీపీ నేత‌ల‌పై మంత్రి సోమిరెడ్డి పైర్

వైసీపీ నేత‌లు చేస్తున్నక‌త్తి సుత్తి డ్రామా ఇక‌నైనా ఆపాల‌న్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయ‌న వైసీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు.. ఘ‌ట‌న జ‌రిగి 25 రోజులు కావ‌స్తున్నా.. స్వంత మీడియాలో అస‌త్య క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.. క‌త్తి శ్రీనివాసులు ఉప‌యోగించిన క‌త్తి కూడా ప్రభుత్వ‌మే త‌యారు చేయించింద‌న జ‌గ‌న్ స్వంత మీడియా డ‌ప్పు కొడుతోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఇక‌నైనా అలాంటి క‌థ‌నాలు ఆపాల‌ని, ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని మంత్రి అన్నారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌పై జ‌గ‌న్ కు నమ్మ‌కం లేద‌న్నారు.. పోలీసుల‌కు పిర్యాదు ఇవ్వ‌కుండా రాజ్ భ‌వ‌న్, రాష్ట ప‌తి భ‌వ‌న్ కు వెళ్లి పిర్యాదు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు..పొర‌పాటున జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే పోలీస్ స్టేష‌న్లు అన్ని ఎత్తేసి రాజ్ భ‌వ‌న్, రాష్ట‌పతి భ‌వ‌న్ లో పిర్యాదు కౌంట‌ర్ ఓపెన్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదేమో అంటూ ఎద్దేవా చేశారు.. జ‌గ‌న్ పార్టీ క‌త్తి డ్రామాలు ఇక‌నైనా ఆపాల‌న్నారు..

SHARE