కోస్తాకు తుపాను గండం

89

The bullet news (WEATHER )- ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తూర్పుమధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. సోమవారానికి కళింగపట్నానికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం… ఇది ఉత్తర వాయవ్యంగా పయనించే క్రమంలో ఇవాళ తీవ్ర వాయుగుండంగా బలపడి రేపు తుపానుగా మారునుంది అంటోంది వాతావరణశాఖ… అనంతరం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం మధ్య ఈ నెల 11వ తేదీన ఉదయమే తీరం దాటుతుందంటున్నారు అధికారులు… దీని ప్రభావంతో ఆదివారం నుంచి ఉత్తర, మధ్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని, ఈ తీవ్రత మరింత పెరుగుతుందని… సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది తుఫాన్ హెచ్చరికల కేంద్రం. ఇప్పటికే వేటకు వెళ్లినవారు వెంటనే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించింది. ఇక నేటి నుంచి ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గాలుల తీవ్రత పెరుగుతోందని… తుపాను తీరం దిశగా వచ్చే క్రమంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు అధికారులు. ఇక ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. బుధవారం నుంచి రెండు రోజులపాటు దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళంపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

SHARE