విభజన హామీలను అమలు చేసే సత్తా మాకే ఉంది – డీసీసీ అధ్యక్షులు పనబాక.

75

THE BULLET NEWS (NELLORE)-ప్రజా వ్యతిరేకత నిర్ణయాలతో దేశంలో బిజెపి బలహీనపడుతోందని విమర్శించారు డిసిసి నెల్లూరు జిల్లా అధ్యక్షులు పనబాక కృష్ణయ్య.. నెల్లూరులోని ఇందిరాభవన్ లో ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు.. కాంగ్రెస్ పార్టీని వీడిన ముఖ్య నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన కోరారు.. విభజన హామీల అమలులో బిజెపి ఘోరంగా విఫలమైందన్నారు.. విభజన హామీలను నెరవేర్చే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు..

కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్ నుండి బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, రాష్ట్రంలో అధికారలోకి వచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు..

SHARE