జాతీయ లోక్ ఆదాల‌త్ ద్వారా కేసులు ప‌రిష్క‌రించుకోండి

60

The bullet news (Nellore)_ దీర్ఘ‌కాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల‌ను రాజీమార్గం ద్వారా సులువుగా ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని లోక్ ఆదాల‌త్ జ‌డ్జీ పీజే సుధ తెలిపారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె వ‌చ్చె నెల 10న జాతీయ లోక్ ఆదాల‌త్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు.. గ‌తంలో నిర్వహించిన‌ ఈ లోక్ ఆదాల‌త్ లో దాదాపు 1194 కేసులను రాజీమార్గం ద్వారా ప‌రిష్క‌రించగ‌లిగామ‌న్నారు.. జిల్లా ప‌రిధిలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 10న జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి క‌క్షిదారులు పాల్గొన్ని సివిల్, మోటార్ వాహ‌నాలు, భూసేక‌ర‌ణ వివాదాలు మొద‌లైన‌టు వంటి కేసుల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు.. గ‌తంలో రాజీమార్గం ద్వారా కేసులు ప‌రిష్క‌రించి దాదాపు 9 కోట్ల మేర క‌క్షిదారుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించామ‌న్నారు..

SHARE