ఆల‌స్య‌మైనా ఏపీ ప్ర‌జ‌ల ఒత్తిడికి త‌లొగ్గారు..- ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి

94

The bullet news (Nellore)- ఆలస్యమైనా ప్రజల ఒత్తిడికి తలొగ్గి టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు నెల్లూరు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి అన్నారు..నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రత్యేకహోదాపై మాట్లాడారు. అన్ని గొంతుకలు కలిసి ప్రత్యేక హోదా నినాదాన్ని కేంద్రానికి వినిపించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు..రాజీనామాలతో సరిపెట్టుకోకుండా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, లేదంటే తమ ఎంపీలు పెట్టే తీర్మానానికి మద్దతివ్వాలని ఆయన సూచించారు.. హోదా కోసం రాజీనామాలు చేసేందుకు ఎమ్మెల్యేలు సైతం సిద్దంగా ఉన్నారన్నారు.. అందరం కలిసి ఒకే తాటిపైకొచ్చి ఉద్యమాన్ని ఉద్రుతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు..

SHARE