The bullet news ( నెల్లూరు ) :- సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న రాజ్యసభ సభ్యులు విపిఆర్.. ఢిల్లీలో కూడా స్పీడ్ పెంచుతున్నారు.. నెల్లూరు సమస్యలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు.. ఇవాళ కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ యువదీర్ సింగ్ మాలిక్ ని న్యూఢిల్లీ లో కలిశారు.. నెల్లూరులో ఏర్పాటు చెయ్యాల్సిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు గురించి చర్చించారు.. గొలగముడి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ ఏర్పాటు అత్యవసరమని ప్రతిపాదన ఉన్నపటికీ నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఫ్లై ఓవర్ ఆలస్యం అవుతుందన్నారు.. దాని వల్ల
పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని విపిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటు గొలగముడి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విపిఆర్ కేంద్ర మంత్రికి వివరించారు.. చింతారెడ్డిపాలెం వద్ద కూడా ఫ్లై ఓవర్ ఆవశ్యకతను మంత్రికి వివరించారు.. ఇప్పటికే ఆలస్యం చెయ్యడం వల్ల చాలా ప్రమాదాలు జరిగాయని, అనేక మంది వికలాంగులుగా మారారని విపిఆర్ కేంద్ర మంత్రితో చెప్పారు.. విపిఆర్ ప్రజెంటేషన్ ను విన్న మంత్రి,  నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ యువదీర్ సింగ్ మాలిక్ లు సానుకూలంగా స్పందించారు.. త్వరలోనే దీనిపై ఒక కీలక ప్రకటన చేస్తామని వారు హామీ ఇచ్చారు..

SHARE