ఉద్యోగాల కోసం ఉద్య‌మిద్దాం – డివైఎఫ్ ఐ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కిర‌ణ్‌

108

The bullet news (Duttalur)- వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ సెప్టెంబ‌ర్ 24న నెల్లూరులో చేప‌ట్ట‌బోయే భారీ బ‌హిరంగ స‌భ‌కు నిరుద్యోగులు వేలాది త‌ర‌లి రావాల‌ని నెల్లూరుజిల్లా డివైఎఫ్ఐ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి కిర‌ణ్ కోరారు.. దుత్త‌లూరులోని ఆర్ అండ్ బి బంగ్లాలో ఆయ‌న డివైఎప్ ఐ నాయ‌కుల‌తో భేటి అయ్యారు..ర్యాలీ, బ‌హిరంగ స‌భ గురించి చ‌ర్చించారు. అనంత‌రం నూత‌న క‌మిటీ ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ మాట్లాడుతూ స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని , నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఓట్ల‌తో గ‌ద్దెనెక్కిన బాబు వారిని పూర్తిగా మ‌ర్చిపోయార‌న్నారు.. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో దాదాపు లఞా 80 వేల ఉద్యోగాలను భ‌ర్తీ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు గుజ్జుల మల్లిఖార్జున, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సింహాద్రి, నూతన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SHARE