డెంగ్యూతో మరో చిన్నారి బలి….

83


డెంగ్యూ డేంజర్ బెల్ మోగుతుంది,అప్రమత్తంగా ఉండకపోతే అంతే అంటే హెచ్చరికలు చేస్తుంది,నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు పోతాయి అన్నట్లు విజృంభించేందుకు రెడీ గా ఉంది..

డెంగ్యూ మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నెల్లూరు నగరం రామచంద్రాపురం కు చెందిన డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీహరి మృతి చెందిన రెండో రోజే.. బుచ్చిరెడ్డి పాలెం కు చెందిన మరో బాలిక గురువారం రాత్రి డెంగ్యూ కి బలి అయింది.
వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంతో ఈ తరహా మరణాలు జిల్లాలో సంభవిస్తున్నాయి. అయిన ఆ శాఖ అధికారులు డెంగ్యూ మరణాలు లేవని మంగళవారం నగరంలో జరిగిన DRC మీటింగ్ లో చెప్పడం విశేషం.

SHARE