నెల్లూరుజిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ…

155

The bullet news (Nellore)- నెల్లూరుజిల్లాలో డెంగ్యూ.. డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. విషజ్వ‌రాలు గ్రామీణ ప్రాంత వాసుల‌ను వ‌ణికిస్తున్నాయి…మ‌లేరియా, టైపాయిడ్, డెంగ్యూ జ్వ‌రాల‌తో కొన్ని గ్రామాలకు గ్రామాలే మంచాన ప‌డుతున్నాయి.. చిన్నా పెద్ద ముస‌లి ముత‌కా అనే తేడా లేకుండా ప్ర‌యివేట్ హాస్ప‌టల్స్ చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేస్తున్నారు.. ఇంత‌కీ జిల్లాలో ఎన్ని డెంగ్యూ కేసులు న‌మోద‌య్యాయి.. అధికారులు చెబుతున్న లెక్క‌లేంటి..? తీసుకుంటున్న ముంద‌స్తు చ‌ర్య‌లేంటి..? ఇవన్నీ తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే..

నెల్లూరుజిల్లాలో తీర ప్రాంత గ్రామాలు వణికిపోతున్నాయి.. విషజ్వరాలు విజ్రంభిస్తున్నాయి.. ఊళ్లకు ఊళ్లను మలేరియా, డెంగ్యూ జ్వరాలు మంచాన పడేస్తున్నాయి.. దీంతో పల్లెలు తల్లడిల్లి పోతున్నాయి.. ఇంటింటా విస్తరిస్తున్న జ్వరాలతో పల్లెలు ,మండల కేంద్రాలు సైతం వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.. అప‌రిశుభ్ర ప‌రిస‌రాల‌తో దోమ‌లు స్వైర విహారం చేస్తు న్నాయి.. మ‌రో వైపు క‌లుషిత నీరు ప్ర‌జారోగ్యాన్ని కాటేస్తోంది..మారుమూల గ్రామాల నుంచి ప‌ట్ణాలు, న‌గ‌రాల వ‌ర‌కు డెంగ్యూ గ‌జ‌గ‌జ‌లాడిస్తోంది..

నిన్న‌గాక మొన్న గూడూరు మాళ‌వ్యా న‌గ‌ర్ కు చెందిన సిద్దార్ద్ అనే విద్యార్ది చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.. అటు మొన్న మ‌నుబోలు మండ‌లం వెంక‌న్న‌పాలెంలో ఓ వివాహిత తో పాటు మరొకరు చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిట్టమూరు, చిల్లకూరులో ఒకరు. తాజాగా తడ మండలంలోని వాటంబేడు లో మదనం బేటి సౌమ్య అనే ఐదో తరగతి చదువుతున్న బాలిక మ్రుతిచెందింది. జ్వ‌ర పీడితులు ఆర్ ఎంపీ డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లితే వారు డెంగ్యూ పేరుతో ర‌క్తం పీల్చు కుంటున్నారు.. వేల‌కు వేల ఖ‌ర్చు పెట్టించుకుని సామాన్యుల్లో భ‌యాన్ని నింపి బ‌ఢా కార్పోరేట్ హాస్ప‌ట‌ల్ కు వెళ్లాలంటూ స‌ల‌హా లిస్తున్నారు.. వైద్య ఆరోగ్యశాఖాధికారులు డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపట్టకపోవడంతోనే సామాన్యులు పిట్టల్లా రాలిపోతున్నారు.. ఎక్కడిక్కడ పారిశుధ్యం పేరుకుపోయినా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.. మనుబోలు మండలంలో ఇప్పటికే ముగ్గురు మ్రుతిచెందగా మ‌రో 25 కుటుంబాలు జ్వ‌రాల‌తో బాధ‌ప‌డుతున్నారు.. వ‌ర్షాకాలం స‌మీస్తున్న నేప‌థ్యంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోడమే ఈ మ‌ర‌ణాల‌ను కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.. అధికారకంగా జిల్లా వ్యాప్తంగా 96 మంది మ్రుతిచెందినట్లు డిఎంహెచ్ వో తెలిపారు..

SHARE