రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది డిప్యూటి కలెక్టర్లు బదిలీ…

రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది డిప్యూటి కలెక్టర్లు బదిలీ # నెల్లూరు DRO గా ఎంవీ రమణ # బాపిరెడ్డి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా& వెల్ఫేర్) గా నియామకం. — రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది డిప్యూటి కలెక్టర్ లను బాదిలీ చేశారు. ఇందులో జిల్లాకు చెందినవారు పలువురు ఉన్నారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ ( ఆసరా ) గా టి .కృష్ణ భారతిని నియమించారు. తను ప్రస్తుతం సిఆర్డిఎ లో విధులు నిర్వర్తిస్తున్నారు. నెల్లూరు మునిసిపల్ కమిషనర్ పనిచేస్తున్న టి. బాపిరెడ్డి ప్రకాశం జిల్లా ఆసరా జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆయన గత కొంతకాలంగా సెలవులో ఉన్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ లో రాజకీయ వత్తిళ్ళు ఎక్కువ కావడంతో బాపిరెడ్డి దీర్ఘకాలం సెలవులు పెట్టారు. అలాగే… జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునను TTD ఎస్టేట్ ఆఫీసర్ గా నియమించారు. ఆయన స్థానంలో ఎంవీ రమణ ను నియమించారు. ఆయన గతంలో జిల్లాలోని పలు విభాగాల్లో పని చేసారు. తెలుగు గంగ ప్రాజెక్టులో నూ పని చేసారు. ఆయా ఉత్తర్వులను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సహాని జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here