పేలిన విమానం టైరు

15

The bullet news(aeroplane)- ల్యాండింగ్‌ అవుతున్న విమానం టైర్‌ పేలి నిప్పురవ్వలు చెలరేగిన ఘటన బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ విమానంలో వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. తిరుపతి విమానాశ్రయంలో రాత్రి 9.55 గంటలకు ఇండిగో విమానం 77 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. శంషాబాద్‌లో రన్‌వేపై రాత్రి 10.30గంటలకు ల్యాండవుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో విమానం టైర్‌ పేలిపోయింది. ఆ ధాటికి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో మంటలు చెలరేగాయి. విమానం ముందుకు కదలకపోవడంతో పైలట్‌ రన్‌వేపైనే నిలిపివేసి టైరు పేలిందంటూ ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

SHARE