ఉరేసుకుని సుబ్బయ్య ఆత్మహత్య…

270

THE BULLET NEWS (GUNTUR)-  గుంటూరు జిల్లా దాచేపల్లిలో అభంశుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు అన్నం సుబ్బయ్య(50) ఆత్మహత్య చేసుకున్నాడు. గురజాల మండలం దైద-తేలుకుట్ల గ్రామాల మధ్య ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర సుబ్బయ్య మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. నిన్న అతను బంధువులకు ఫోన్ చేసి చచ్చిపోతున్నానని చెప్పిన తరువాత, కృష్ణా నదిలో గాలింపు చర్యలు కూడా ప్రారంభించారు పోలీసుల బృందం. ఈ క్రమంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహం కనిపించింది. ఇది సుబ్బయ్య మృతదేహంగా గుర్తించారు పోలీసులు. మరోవైపు సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని బాధిత బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

SHARE