బక్రీదు నాటికి బారాషహీద్ దర్గా అభివృద్ధి పనుల్లో కీలక పురోగతి

21

The bullet news ( Nellore) _ నగరంలో ప్రసిద్ధిగాంచిన బారా షహీదు దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఈ ఏడాది బక్రీదు పండుగ నాటికి కీలక పురోగతి సాధిస్తామని మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ప్రధాన హైమాస్టు లైట్లను మేయరు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించారనీ, వాటి వినియోగంలో భాగంగా ఐదువేల మంది ప్రార్ధనలు జరిపేలా పాలరాతి ఏసీ మసీదు నిర్మాణాన్ని ప్రాంగణంలో చేపట్టామని వివరించారు. అరబిక్ లైబ్రరీ, పచ్చదనం, పారిశుధ్యం, అధునాతన ప్రహరీ, ప్రధాన గేటు నిర్మాణాల పనులు ఆరంభిస్తున్నామని మేయరు వెల్లడించారు. రంజాను, బక్రీదు పండుగల ప్రత్యేక ప్రార్ధనల నిమిత్తం సుమారు ఐదున్నర కోట్ల నిధులతో అంతర్జాతీయ స్థాయిలో భారీ శాశ్వత పైకప్పు నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి మేయరుకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మతపెద్దలు అబూబకర్, ఖాజావలి, నన్నే సాహెబ్, సయ్యద్ సమీ, మొయునుద్దీన్, మౌలానా, హయత్, జాఫర్, కార్పొరేటర్లు నూనె మల్లికార్జున, రాజానాయుడు, ప్రశాంత్ కిరణ్, మన్నెం పెంచల నాయుడు, ప్రశాంత్ కుమార్, కార్పోరేషను అధికారులు పాల్గొన్నారు.

SHARE